Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి…అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.

 

మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి

” పద్ధతులను” అనగా బోధన యొక్క విషయము – బోధించడము, సిద్ధాంతము, బోధన. ఆంక్షలు మనుష్యులనుండి వస్తాయి, దేవునినుండి కాదు. ఆంక్షలకు ఏకైక అధికారి మనిషే.

యేసు పరిసయ్యులను సవాలు చేశాడు, ” అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.” మీరు మీ సన్మానాలు నిర్వహిస్తున్నందున బయటకు గొప్పగా కనిపిస్తున్నారు కానీ లోలోపల మీరు కుళ్ళిపోయిన ఎముకలతో నిండిన సమాధిలాంటి వారు.

వాడుకొనుటచేత నశించిపోవును.

“ఏవి” – 21 వ వచనములోని మూడు ఆంక్షలు.

ఇక్కడ “నశించు” అనే పదానికి అర్థం నాశనం చేయడం, వినాశనము లేదా విధ్వంసం చేసే స్థితి, విచ్చిన్నం చేయుట. ” వాడుకొనుటచేత అన్నీ నశించిపోవును” అనే ఈ వాక్యాన్ని మన౦ అనువది౦చేయవచ్చు. అవి శాశ్వతం కాదు, తాత్కాలికమే. వాటి ఉద్దేశంలో ఆంక్షలు విఫలమవుతాయి.అవి చెడును ఆపు చేయలేవు.

అవన్నియు వాడుకొనుటచేత

“వాడుకొనుట” అనే పదం దుర్వినియోగం చేయడాన్ని సూచిస్తుంది, దేనినైనా ఉపయోగించడం, వినియోగించడం. “వాటిని వాడేయుట ద్వారా” అనే క్లాజును మన౦ ఉపయోగించవచ్చు. మనం ఆంక్షలు అనుసరించినప్పుడు, వాటిని మరింత ఉపయోగించడానికి వీలుకానివిగా చేస్తాం. వాటిలో ఆంతర్య విలువ లేని కారణాన మనిషి చేసిన ఈ నియమాలు నశించిపోతాయి. వాటిని ఉపయోగించే వారు అవి నశించి పోయినవాని సాక్ష్యము ఇస్తారు. అవి క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తాయి. వాటికి మనుషుల ఆజ్ఞాలే తప్ప వాటికి వేరే అధికారం లేదు.

నియమము:

అతి-నియంత్రణ చెడును తీవ్రపరుస్తుంది.

అన్వయము:

మానవ సిద్ధాంతం వినియోగంతో నశిస్తుంది. స్వయం కృషితో పరిశుద్ధత సాధించుట మానవ సిద్ధాంతం. ఇది సిద్ధాంతపరంగా తప్పు మరియు ఫలితాలలో అనుత్పాదకమైనది. మనుష్యుల ఆంక్షలను ఆచరిస్తే మనం మన జీవితాలను తాత్కాలలికమైన విషయాలతో సరిపోల్చుకుంటాము. ఆధ్యాత్మిక విషయాల్లో మనుష్యులకు స౦బ౦ధి౦చిన తాత్కాలిక సిద్ధా౦తాల ప్రభావము కొద్దిపాటిదే. అది కాలాన్ని వృధా చేస్తాయి మన జీవితాలను వ్యర్ధం చేస్తాయి. బైబిలు నిత్యమైన విషయాలనుగూర్చి నొక్కిచెబుతో౦ది. నిత్యత్వములో మానవ ఆంక్షలు నాశనములో ముగుస్తాయి.

అకారణమైన అణచివేత హింసాత్మక విస్ఫోటనానికి దారితీస్తుంది. మనం చెడుని నొక్కిఉంచితే అది మన జీవితాల్లో కొంత కాలంలో విస్ఫోటనం అవుతుంది. అణచివేత సరియైన విధానము కాదు, కానీ ఒక వ్యక్తి చుట్టూ మన జీవితాలను జీవించుట.

ఆంక్షలు వ్యర్థమైనవి. మన జీవితాలను నియమ నిబంధనలతో దహించివేయబడి, చివరిలో దాని కోసం చూపడానికి ఏమీ ఉండదు.

Share