మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా ….అను విధులకు మీరు లోబడనేల?
అను విధలకు మీరు లోబడనేల?
” విధులు” అనేవి మనిషి తయారు చేసిన నియమాలు. వాటికి బైబిలులో ఏ ఆధారమూ లేదు. ఇది మీకు-మీరుగా- చేసుకోండీ అనే మతం. క్రైస్తవ్యము మతము కాదు. మనిషి బాధ్యతకు మతం ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. కృప దేవుడు చేసే దాని మీద దృష్టి పెడుతుంది.
అందరూ తమ ధర్మం సరైనదే అనుకుంటారు. వీరిలో చాలా మందికి చిత్తశుద్ధి ఉంది. అయితే, మనం ఎంత నిజాయితీగా ఉన్నా, మనం తప్పు చేస్తే, మనం సత్యం నుంచి మరింత దూరముగా తొలగిపోతాము. చిత్తశుద్ధి జారిపడదానికి ప్రాంగణమవుతుంది. మనము పూర్తిగా తప్పుఐతే చిత్తశుద్ధి సుగుణముగా ఉండదు. చిత్తశుద్ధి నకిలీది కావచ్చు. చాలా వరకు-మంచిగా జీవించు అనే వారు చిత్తశుధ్ధిగా ఉంటారు కానీ వారు సంపూర్తిగా తప్పులో ఉన్నారు. మంచిగా జీవించు అనే వారు అన్నిటిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. పాపము కొరకు బాధలు అనుభవించునప్పుడు, క్రీస్తు మరణము మీద మనము మెరుగు పడలేము. మనం ఆయన్ని ఎదుర్కొనప్పుడు దేవుడు సర్వ మానవ సత్కార్యలన్నీ తిరస్కరిస్తాడు. సిలువపై క్రీస్తు చేసిన కార్యము మాత్రమే ఆయనను ఆకట్టుకుంటుంది.
నియమము:
మన ప్రమాణాలను వేరొకరి మీద రుద్దే హక్కును బైబిలు మనకు ఇవ్వదు.
అన్వయము:
యేసు సన్యాసి జీవితాన్ని గడపలేదు. ఆయనను ఆహ్వానించినప్పుడు విందులలో,వివాహాలలో పాల్గొన్నాడు. లోక౦లోని దుష్టత్వ౦ గురి౦చి ఆయన ఒక మూల ఏడుస్తూ కూర్చోలేదు. సామాన్య అతిధిగా ప్రత్యేక కార్యక్రమాలకు హాజరయ్యాడు.
క్రైస్తవులు ఆంక్షలను(టాబూ) ఇష్టపడుతారు. మతం వారిని ఎప్పటికప్పుడు తప్పుడు ఆలోచనలను లాగుతుంటుంది. ఆంక్ష (టాబూ) అనగా క్రైస్తవుడు తప్పుగా భావించు విషయము కానీ బైబిలు దాని గురించి ఏమీ చెప్పదు. బాలురు, బాలికలు ఒకే పూల్ లో ఈత కొట్టడం తప్పని కొందరు క్రైస్తవులు అభిప్రాయపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని కొన్ని ప్రాంతాలలో “మిక్స్డ్ స్నానము” అనేది ఒక నిషిద్ధము. మేక్ అప్ ధరించడం ఇతర సమూహాలలో తప్పు. బైబిలు ఈ విషయాలు పాపము అని చెప్పదు.
మనమంతా సన్యాసత్వా ధోరణి వైపు మక్కువ కలిగి ఉన్నాము. మనల్ని మనం కొత్త రకమైన బంధకాలలో పెట్టుకోవడం మనకు ఇష్టము. నియంత్రణ అనేది మతం యొక్క వెన్ను-ఎముక. “ముట్ట వద్దు, రుచి వద్దు, పట్టుకొనవద్దు” అనే తరువాతి వచనాన్ని గమనించండి. నిబంధనలను పాటించడం వల్ల వారు పుణ్యాత్ములు అనే భావనను ప్రజలకు కలిగిస్తుంది.
అన్ని ఆంక్షలు చెడ్డవి కావు. కొ౦తమ౦ది తమ పాపాన్ని సమర్థి౦చుకోవడానికి ఎలా౦టి పగటి వేషమైనా వేస్తారు. పరిణతి చె౦దిన క్రైస్తవుడు బలహీన౦గా ఉన్న సహోదరుని నొప్పించకుండా చూసుకుంటాడు (రోమీయులు 14, 15; I కొరింథీయులకు 8-10).