Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి… విధులకు మీరు లోబడనేల?

 

న్యాయవాదమును అంగీకరించువాడు సన్యాసత్వము అంగీకరించువాడు.  సన్యాసి అంటే స్వీయ తిరస్కార ధర్మం.  ఇది మానవుడు దేవునికి అందించుట ద్వారా దేవుని అనుగ్రహాన్ని కోరే  వ్యవస్థ, ఇది సిలువను సరిపడని దానిగా తిరస్కరిస్తుంది.  సిలువే మన రక్షణకు ఆధారము మాత్రమే కాదు, మన పరివర్తనకు కూడా ఆధారము.

కాబట్టి (కొన్ని తర్జుమాలలో లేదు)

“కాబట్టి” దీనిని మనం చూసిన ప్రతిసారీ, పైన ఉన్న విషయము ఏమిటో మనం చూడాలి!  ” కాబట్టి ” అనునది మనం కూడిక చేయు అంకెల వరుస కింద గీసే గీత లాంటిది.  పౌలు ఇప్పుడు న్యాయవాదము, రహస్యవాదము, మరియు సన్యాసత్వము గురించి నిర్ధారణలను చేస్తున్నాడు.  జుడాయిజం మరియు జ్ఞానవాదము (16-19) యొక్క నిబంధనలతో శిలువ  తీవ్రంగా వ్యవహరించింది అని అతను స్పష్టము చేస్తున్నాడు.

క్రైస్తవ్యము మతము యొక్క విరుధ్ధత.  క్రైస్తవ్యము అనేది క్రీస్తు సంపూర్తి చేసీన కార్యము మీద ఆధారపడే, దేవునితో ఒక సంబంధం.  యేసు చేయవలసినదంతా చేసెను; మనము చేయవలసినది ఏదీ లేదు.  యేసు మన పాపముల నిమిత్తము తన మరణము ద్వారా దేవుని నీతియుక్తమైన డిమాండ్లను తీర్చాడు.

మీరు క్రీస్తుతోకూడ …. మృతిపొందినవారైతే

“ఒకవేళ” అని “అయితే” అనే పదాన్ని మనం అనువదించవచ్చు.  క్రీస్తుతో మనము చనిపోయిన విషయము వాస్తవము అని గ్రీకు భాషలో ఉపయోగింపబడిన మాట సూచిస్తుంది.  అది సంభావ్యము కాదు; అది వాస్తవమే. దీనిని “స్థాన సత్యము” అని  పిలుస్తాం.  లోక పాపములన్నియు క్రీస్తు మీది కురిపించబడెను.మనము దేవుని విశ్వసించిన తరుణములో దేవుడు క్రీస్తు మరణము ద్వారా అంతిమముగా మరియు ఎప్పటికీ మన పాపాలను క్షమిస్తాడు, దేవుని ముందు మన స్థానము ఎప్పటికి పరిపూర్ణమైనది.

మనం క్రైస్తవుడిగా మారినపుడు దేవుడు మనకోసం ఏం చేశాడో మనలో చాలామందికి తెలియదు.  సిలువను చూసినప్పుడు , ఒక విషయము చూస్తాము, దేవుడు ఇంకొక విషయము చూస్తాడు.  సిలువను చూసినప్పుడు మనము అక్కడ క్రీస్తు మరణించుట చూస్తాము.  విశ్వసించు ప్రతి వ్యక్తినీ దేవుడు క్రీస్తుతోపాటు అక్కడ మరణిస్తూ ఉన్నట్లుగా చూస్తాడు.

“మృతి” అనే పదం మరణానికి ఉపయోగించు అత్యంత తీవ్రమైన పదం.  క్రీస్తుతోపాటు విశ్వాసి యొక్క మరణ౦, మానవ నియమాల ను౦డి వేరుచేయబడుటను నొక్కిచెబుతో౦ది.  యేసు చనిపోయినప్పుడు మనము మరణించాము (గలతీ 2:20).  దేవునిలో క్రీస్తుతో మన జీవితం ఎప్పటికీ దాచబడి ఉంటుంది.

నియమము:

క్రీస్తుతో మన సహమరణము దేవుడు మరల మన పాపములను మనకు విరోధముగా తీసుకురాడని మనకు బోధిస్తుంది.

అన్వయము:

క్రీస్తు మరణము ద్వారా మనలను క్షమిస్తున్నప్పుడు దేవుడు మన అపరాధమును ఎప్పటికి తొలగించాడు.  ఈ న్యాయచర్య శాశ్వత౦గా విశ్వాసి ను౦డి వచ్చిన అపరాధ భావాలన్నీ తొలగి౦చింది.  అది దేవుడు ఎదుట పూర్తిగా పవిత్రపరచబడిన వ్యక్తిగా నిలబడటానికి సాధ్యమైంది.  దేవుడు మన పాపమును క్రీస్తుపై ఉంచి, ఆయనతో మనలను గుర్తించెను గనుక, ఆయన మన పాపమునుండి మనలను  నిర౦తరము శుద్ధీకరించాడు.  మన౦ ఈ విషయాన్ని నిరాకరిస్తే, క్రీస్తు కార్యమును సంపూర్తి చేయటను మన౦ నిరాకరించినట్లే.

ఇది అపరాధ భావన నుండి ప్రక్షాళన కంటే చాలా ఎక్కువ. అది ఆయన మరణమున౦దు క్రీస్తుతో ఒక గుర్తి౦పు.  మన౦ ఇప్పుడు పునరుర్ధానుడైన దేవుని కుమారుడితో నూతనత్వజీవితములో నడువగలం.

దేవుడు మనలను మతపరమైన వస్త్రములో వేయలేదు.  ఎన్నెన్నో అసంగమైన మత స౦బ౦ధమైన అ౦శాలు దేవునిని ముగ్ధుడిని చేయలేవు.  ఈ విషయాన్ని దేవుడితో చెప్పినప్పుడు, అది తమ లెక్కలో  ఉంటుందని ప్రజలు నమ్ముతారు.  బైబిలు పరముగా ఇది ఒక కట్టు కథ లాంటిది.

మతం క్రీస్తుతో మన సంబంధాన్ని పాడు చేస్తుంది.  అది శిలువ సాఫల్యమును విస్మరిస్తుంది.  యేసు ఇదంతా చేశాడు; ఆయనకు అన్ని విధాలా రుణపడి ఉంటాను.  క్రీస్తు సంపూర్తి చేసిన కార్యము, ఖచ్చితంగా పరిశుధ్ధ  దేవునిని సంతృప్తి పరచగలదు.

Share