Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి;

 

దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి

“ఆరాధన” భక్తిని తన బాహ్య అంశంలో సూచిస్తుంది, మతపరమైన ఆరాధన, ముఖ్యంగా మతసంబంధమైన వేడుకల సేవలు.

అపో.కా. 26:5లో  యూదుల మతము అను మాట వాడబడినది.

యాకోబు 1:26, 27లో రచయిత ఈ వాక్యాన్ని, మోసపూరితభక్తి,  “నిష్కళంకమైన భక్తి” అనగా “త౦డ్రి లేని, విధవరా౦డ్రను తమ శ్రమలో పరామర్శించుట” కు వ్యత్యాసాని తెలుపుతూ  ఉపయోగించారు.

పౌలు ఈ వచన౦లో ప్రారంభదశలో ఉన్న జ్ఞానవాదముకు వ్యతిరేక౦గా వాదిస్తున్నాడు.  మానవులందరి మధ్య దేవదూతల పరంపర ఉందని జ్ఞానవాదము తెలుపుతుంది.  మనం దేవునిని బుజ్జగించాలి.   కాల్పనిక అజ్ఞానంలో మొదలైన జ్ఞానం, చివరివరకూ అన్ని విషయాల ఏకత్వాన్ని అర్థం చేసుకునే సంపూర్ణత్వంలోకి ప్రవేశించేవరకు పెరుగుతుంది.

నియమము:

మన తరము యొక్క జ్ఞానావాదము నవయుగ ఉద్యమం (న్యూ ఏజ్ మూవ్మెంట్).

అన్వయము:

సాతాను ప్రజలను భాక్తి విధానము ద్వారా మోసాగిస్తున్నాడు. నూతన యుగపు ఉద్యమం పేరుతో నేడు విస్తృతంగా ఉన్న జ్ఞానవాదము యొక్క పురాతన విషయం కనిపిస్తుంది.  ఇది అన్ని విషయాల ఏకత్వాన్ని కోరుకుంటుంది. మనం సృష్టించబడిన పదార్థం యొక్క విశ్వంలో భాగమని వారు మనకు చెబుతుంటారు.  దేవునితో ఏకమగుట వలన మనమందరము ఏకమౌతాము.

మనం ఆత్మ నుండి తప్పించుకుని విశ్వంతో ఏకత్వంలోకి తరలించబడగలం అని వారు పేర్కొంటారు. అ౦దుకే పౌలు దాన్ని ఇక్కడ “అతి వినయ౦” అని పేర్కొన్నాడు.  ఇది మిమ్మల్ని దాటి ముందుకు సాగాలని చెప్పుకుంటుంది.  వాస్తవ ఆచరణలో, ఇది స్వార్ధ దృష్టి.  మీ స్వయం శక్తులన్నీ అభివృద్ధి చెందించడమే అసలైన లక్ష్యం. దీనిని మనం మానవ శక్తి ఉద్యమమనిపిలుస్తాం.  మీకు కావలసింది ఇప్పటికే మీ లోపల ఉంది.  మీరు చేయాల్సిన పని అంతా బయటకు తీసుకొచ్చి మీ అవకాశాలను, పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోండి.

షెర్లిన్ మక్లిన్ యొక్క విచిత్ర ఆత్మ జీవులు, జ్యోతిషశాస్త్రం, అవీజా బోర్డులు, టారట్ కార్డులు మరియు అసర్టెడ్ పురుషులుగా పిలువబడే వారు, స్వామీజీలు, యోగులు మరియు గురువులు ప్రస్తుతం రోజు జ్ఞానవాదులు. మన మానవత్వం యొక్క అవకాశాలను నెరవేర్చేందుకు మన అవగాహనను పెంచడంలో ఈ పురస్కరాలన్నీ తోడ్పడతాయి అని చెప్పుకుంటారు.

మానవ సామర్థ్యాల కదలికలతో ప్రమేయం ఉన్న క్రైస్తవుడు ప్రస్తుతపు జ్ఞానవాది.

Share