అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి;
అతి వినయాసక్తుడై
అది అబద్ధమని సూచించడానికి “వినయం” అనే పదంలో ఏమీ లేదు. అది అబద్ధపు వినయ౦ అని స౦దర్భము సూచిస్తో౦ది. మన౦ ‘ వినయము’ ను ‘అప్పగించుకొనుట’ గా చూడవచ్చు. దేవదూతల ఆరాధనకు అప్పగించుకొనుట. ఇది వినయముగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ వారు గర్వపడే వ్యక్తులు.
మన౦ దేవునితో మాట్లాడడానికి అర్హుల౦ కాము అన్నట్లుగా వినయ౦గా దేవదూతల ఆరాధన ద్వారా చూపి౦చబడుతుంది. అది వారి స్వయముగా ఏర్పరచుకున్న వినయ౦, దేవుడు ఆజ్ఞాపించిన వినడ౦ కాదు. ఈ భావనలు పూర్తిగా మనుష్యుల ఆవిష్కరణలు, బైబిల్ నుండి కాదు (యెషయా 8:20; I కొరిం 4:6). అందుచేత ఈ విషయమంతా భూటకమే. అది క్రీస్తు మన పాపమూలకొరకైన మధ్యవర్తిత్వమును౦డి దూర౦ చేస్తుంది. మతసంబంధ గర్వ౦ మనిషిని దేవుని వాక్య౦ మీద అనుమాన పడునట్లు చేస్తు౦ది.
దేవుని కోస౦ తాము ఇచ్చువాటితో చాలామ౦ది ముగ్ధులయ్యారు. వారు దేవుని కోసం బాధపడితే, అది దేవుని ప్రలోభపెట్టడానికి అని భావిస్తున్నారు. దేవుడు మనకు కేటాయింపులను చేసే పనిలో ఉన్నాడు. దీనిని కృపా నియమము అని పిలుస్తాడు. దేవునినుండి వచ్చిందని గుర్తించినప్పుడు అది సరియైనవినయము. ఏదో భయంకరమైన అనుభవం మన మనకు ఎదురైనప్పుడు సాధారణంగా ఉపరితలానికి తీసుకురాగల ఒక పరంపర మనలో మనందరికీ ఉంటుంది.
నియమము:
ఆధ్యాత్మిక గర్వం అనేది సరిచేయుటకు అతి కష్టతరమైనది.
అన్వయము:
“నేను స్వర్గానికి వెళ్తున్నాను అని నాకు తెలుసు అని ఖచ్చితంగా చెప్పలేరు. ఖచ్చితంగా దానిని ఎవరూ తెలుసుకోలేరు. మనకు అక్కడకు చేరే వరకు మనకు అర్హత ఉందో లేదో తెలియదు. నేను అక్కడికి వెళ్తున్నాను అని నాకు తెలుసు అని చెప్పుకునే స్పష్టత లేదు. ” ఇది అతి వినయం అన్నమాట. అది బైబిలుమీద సంపూర్ణ అపనమ్మిక.
మన౦ పరలోకానికి వెళ్తున్నాము అని బైబిలు స్పష్టముగా చెబుతో౦ది.
ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది.దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను (1యోహాను 5:11-13)
బూటకపు స్వీయ-వినయము ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది కానీ అది నిజమైన వినయం కాదు. నిజమైన వినయ౦ దేవునిమీద, ఆయన కృప (ఏర్పాట్ల) మీద దృష్టిపెడుతుంది. అబద్ధ వినయ౦ స్వార్ధముపై శ్రద్ధను చూపిస్తుంది.