Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి;

 

మీ బహుమానమును

కొలొస్సియులు బహుమతి పొందటానికి అర్హులు కాదని అబద్ద బోధకులు న్యాయనిర్ణీతగా (రిఫరీగా) తీర్పు ఇస్తారు. వారు బహుమతికి అర్హులు కాదని అనర్హులుగా ప్రకటించి, ఖండించారు మరియు తీర్పు ఇచ్చారు. అబద్ద బోధకులు క్రైస్తవుని తన ఆధ్యాత్మిక బహుమతిని పొందనీకుండా దోచుకోవచ్చు. మన రక్షణను మనం కోల్పోలేము కాని మనం బహుమతిని కోల్పోవచ్చు. అబద్ద బోధకులు మీ ప్రతిఫలం నుండి మిమ్మల్ని దూరముచేయవచ్చు. క్రైస్తవులు భక్తి విధానములో దాడికి పాల్పడుట ద్వారా మాత్రమే వారు విశ్వాసులను సత్యానికి దూరంగా నడిపించగలరు.

మేము మీమధ్యను నెర వేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి (2యోహాను 1:8)

క్రీస్తు తీర్పు సింహాసనము వద్ద సగం బహుమతి కాకుండా పూర్తి బహుమతిని మనము కోరుకుంటాము. ఆయనను చూసినప్పుడు మనకు అర్హత ఉన్న ప్రతిదాన్ని మనము కోరుకుంటాము. రక్షణ ఉచితం కాని మనం ప్రతిఫలమును సంపాదించుకోవాలి. రక్షణ ఒక ఉచిత బహుమతి కనుక మనం దానిని కోల్పోలేము. మనము బహుమానముల కోసం పనిచేస్తున్నందున, మనము వాటిని కోల్పోతాము.

నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము. (ప్రకటన 3:11)

అపహరింపనియ్యకుడి;

” అపహరించుట” అంటే వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం, ఖండించడం. ఇది రెండు గ్రీకు పదాలైన కటా-వ్యతిరేకముగా, మరియు బ్రబ్యూ-న్యాయనిర్ణీతగా వ్యవహరించు అను పదాలనుండి వచ్చింది. మనలో చాలా మంది న్యాయవాదులనుండి (అంపైర్లు) బంతులు అయినప్పుడు నో బాల్ గా తెర్పు పొంది ఉంటారు. న్యాయనిర్ణీత యొక్క నామవాచకం క్రింది వచనాలలో సంభవిస్తుంది

పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగానియొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. (1కొరిం 9:24)

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. (ఫిలిప్పీ 3:14)

ఈ క్రియ కొలస్సీ 3:15 లో కనిపిస్తుంది, “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. ”దేవుని శాంతి మన హృదయాలలో న్యాయనిర్ణీతగా పనిచేయడానికి మనము అనుమతించినప్పుడు, మనకు తోటివారితో ప్రశాంతత ఉంటుంది. దేవుడు ఇచ్చే సమాధానము మన పోరాటంలో నిర్ణయాత్మక ఓటు వేయనివ్వండి.

ఈ లేఖన భాగములోని న్యాయనిర్ణీత, సత్యానికి కట్టుబడి ఉండటాన్ని నిరాశపరిచే తప్పుడు బోధకుడు. ఇంకొక వ్యాఖ్య ఏమంటే “మీమీద లేక మీకు విరోధముగా ఎవరిని న్యాయనిర్ణీతులుగా ఉందనీయవద్దు.” “ఏ మనిషి తీర్పునకు మీరు గురి కాకవద్దు.”

నియమము:

అబద్ద బోధకులు క్రైస్తవులను తప్పుడు విధానముకు గురిచేయడం ద్వారా వారి బహుమతిని దోచుకోవచ్చు.

అన్వయము:

సత్యముపట్ల అజాగ్రత్తతో కూడిన మీ వైఖరితో మీరు పరలోకములో మీ ప్రతిఫలము విషయములో మోసగింపబడుతున్నారా?

Share