Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;

 

‘ నివసించుచున్నది ‘ అనే పదానికి శాశ్వతంగా నివసించడం అని అర్థం; క్రీస్తులో శాశ్వతంగా నివసించుదానిని ఇప్పుడు మనం చూస్తున్నాము.

ఏలయనగా దేవత్వముయొక్క

యేసుక్రీస్తు దేవుడు అనే స్వభావం లేదా స్థితిలో ఉన్నాడు. ‘దేవత్వము’ అనే పదానికి అర్థం – ‘దైవము, దైవ స్వభావం, దైవిక జీవి’. కుమారునిలో దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత నివసించుచున్నది. అతను కేవలం దైవత్వం కంటే ఎక్కువ కలిగిఉన్నాడు. ఆయన సంపూర్ణ దేవుడు.

‘దైవత్వము’ అనే పదాన్ని ‘దైవము’ నుండి వేరుగా చూడాలి. గ్రీకులో ఆ మాటకు మరో అర్ధము ఉన్నది.

సర్వపరిపూర్ణత

‘ సర్వపరిపూర్ణత’ అనునది ‘దైవత్వము’ అనే పదం ద్వారా నిర్వచించబడింది. ‘దైవత్వము’ అంటే కేవలం దైవిక గుణాలు కాదు, దేవుని సారాంశం.

‘ సర్వపరిపూర్ణత ‘ అనే పదం ఒక విషయం నిండినదాన్ని సూచిస్తుంది. ఇది మొత్తం పరిమాణాన్ని సూచిస్తుంది, పరిపూర్ణతకు ప్రాధాన్యత ఇస్తుంది – పూర్తి సంఖ్య, పూర్తి కొలత, మొత్తం. దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని దీని అర్థం. యేసుక్రీస్తు సంపూర్ణముగా దేవుడు. ఆయన ఖచ్చితంగా దేవుడు.

యేసు క్రీస్తు దేవుని సంపూర్ణతను కలిగి ఉన్నాడు, దేవుని సారాంశం యొక్క కొన్ని అంశాలు కాదు. దేవుని అపరిమితమైన శక్తి , దేవుని సంపూర్ణ లక్షణాలను యేసు క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. ‘ సర్వపరిపూర్ణత ‘ దేవుడు ఏమైఉన్నాడో అనుదానిని వివరిస్తుంది. ఆయన కేవలం దేవునివంటివాడు కాదు. ఆయనే దేవుడు.

నియమము:

యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. క్రీస్తు దేవుని నిజమైన జ్ఞానము; క్రీస్తునుకలిగి ఉన్నవారు దేవునిని కలిగిఉన్నారు.

అన్వయము: 

క్రీస్తు కంటే ఎక్కువ కావాలని కోరుకునేవాడు దేవుని కన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. క్రీస్తును కనుగొనడానికి మనము ప్రపంచాన్ని పరిశీలించము; ప్రపంచాన్ని చూడటానికి మేము క్రీస్తును అధ్యయనం చేస్తాము. యేసుక్రీస్తు గురించి మీ అభిప్రాయం ఎంత ఎక్కువగా కలిగిఉన్నారు? మీరు ఆయనను సర్వశక్తిమంతుడైన దేవుడిగా అర్థం చేసుకున్నారా లేదా మహిమాన్వితమైన వ్యక్తిగా అర్థం చేసుకున్నారా?

Share