Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

 

వారిని …బాహాటముగా వేడుకకు కనుపరచెను.

ఒక విజయోత్సవ ఊరేగింపులో తన బ౦దీలను లేదా పతకాలను ప్రదర్శించు విధ౦గా, యేసు ప్రధానులను అధికారులను బాహాటముగా వేడుకకు కనుపరచెను. ” బాహాటముగా వేడుకకు కనుపరచెను” అనగా బహిర౦గముగా అవమానపరచుట, సిగ్గుపడునట్లు చేయుట అని అర్ధము. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో యేసును బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు అనుమాటలో ఉపయోగి౦చబడినది (6:6). మన వర్తనవలన దేవుని కుమారుని మరల సిలువవేయుచున్నప్పుడు మనము ఆయనను అవమానమునకు గురిచేస్తాము.

మత్తయి 1:19లో వివాహానికి ము౦దు గర్భవతిగా ఉన్న కారణ౦గా మరియ బహిర౦గముగా అవమానము చేయడానికి యోసేపుకు ఇష్టములేని సంధార్భములో ఈ పదాన్ని ఉపయోగి౦చారు. సైప్రియాన్ నియమం ఈ పదాన్ని ఒక వ్యభిచారిణి యొక్క జుట్టును కత్తిరించబడి మరియు సమాజం ద్వారా తిరస్కరణకు గురి చేయబడుట కోసం ఈ పదమును ఉపయోగించారు. ఇది అవహేళన, బట్టబయలు చేయు అనే ఆలోచనను కలిగి ఉంటుంది.

“కనుపరచెను” అనేది ఒక జాతీయము = అక్షరాలా “ధైర్యముగా;” ప్రస్ఫుటంగా లేదా బహిరంగంగా తెలిసిన పద్ధతిలో” అను భావము. పాపమును మోయుట ద్వారా యేసు దుష్టశక్తులను బహిర౦గముగా సిగ్గుపరచెను. మానవుని మీద ఉన్న పాపము వాటి ఆరోపణ.

యేసు బాహాట౦గా వారిని తన బాధితులుగా, కొల్లసొమ్ముగా ముద్రించాడు. దేవుని ఆర్థిక వ్యవస్థలో  వారు వైఫల్యులు అని ఆయన పరాజయులను ప్రదర్శించాడు.

నియమము:

మన ప్రభువు వ్యక్తిగతంగా దయ్యములను సిలువపై బహిరంగంగా ఓడించాడు.

అన్వయము:

చాలామ౦ది క్రైస్తవులు దయ్యాల గురి౦చి అనవసర౦గా ఆందోళన చెందుతారు. దయ్యాలు క్రైస్తవ జీవితాన్ని ఓడించడానికి ఉపయోగి౦చగల కొన్ని నిగూఢమైన శక్తిని కలిగి ఉన్నాయని వారు నమ్ముతారు. వారు దయ్యపు శక్తుల పరబావములో ఉన్నారని భావిస్తారు. ఈ వచనభాగ౦, యేసు బాహాట౦గా దయ్యాలను సిలువపై పరాజయులుగా ముద్రవేసినట్లు చెబుతున్నది. సిద్ధాంతపరంగా, సిలువ ఇప్పటికే వారిని ఓడించింది, ” అపవాదియొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ” (I యోహాను 3:8).

Share