వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి
సిలువపై క్రీస్తు చేసిన కార్యము యొక్క ఏడవ ఫలితము: ” మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి” యేసు మనకు వ్యతిరేకంగాఉన్న ధర్మశాస్త్రము యొక్క రుణములన్నిటిని తొలగించాడు.
వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన…. నుండిన పత్రమును …దానిమీది చేవ్రాతను తుడిచివేసి,
దేవుడు మనలను క్షమించినపుడు (13 వ వచనము) ఆయన మనకు విరోధముగా దేవుని లిఖిత ధర్మశాస్త్రముపు తీర్పును రద్దుచేసెను (రోమా 3:19).
“తుడిచివేసేను” అంటే తుడుపుపెట్టుట, ఉపేక్షించుట. ఇది ఒక సమ్మేళన పదం కాబట్టి మూలభాషలో ఇది ఒక తీవ్రమైన పదం. దేవుడు క్రొత్త నిబంధనలో అనేక విషయాలను తుడిచివేసాడు: అపొస్తలుల కార్యములు 3:19 (పాపాలు); ప్రకటన 3:5 (ఒక పుస్తకంలో పేరు); 7:17 (కన్నీళ్లు). ఇక్కడ దేవుడు మనపై ఆరోపణల జాబితాను తుడిచేస్తున్నాడు. దేవుడు మన పాపాన్ని క్షేమించుటే కాదు, దాని రికార్డును తుడిచిపెట్టాడు. చేతిరాత చెరిగిపోవడం మాత్రమే కాదు, పత్రమే ఎత్తివేయబడింది.
” వ్రాతరూపకమైన” అనే పదాన్ని ఒక బహిరంగ రుణ పత్రము కోసం కొత్త నిబంధన వెలుపల రాతపూర్వకంగా ఉపయోగింస్తారు. ముఖ్యంగా ఆర్ధిక సంబంధ అకౌంట్లను రికార్డు చేసే విధంగా దీన్ని ఉపయోగించారు. పత్రంలోని లిఖిత స్వభావంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇది రుణగ్రహీత తన ఋణమును గూర్చి తనచే సంతకం చేయబడ్డ పత్రము. దీనిని ఋణ పత్రము అని పిలుస్తాము. మన సొంత చేతిరాతతో మనము కుదుర్చుకున్న అప్పుల రికార్డు అది. దేవునికి మనము అచ్చిఉన్న ఈ అప్పుల రికార్డును యేసు రద్దుచేసాడు.
ప్రామిసరీ నోట్ పై ఆటోగ్రాఫు కోసం దాదాపు ప్రత్యేకంగా ” వ్రాతరూపకమైన ” ఉపయోగించబడుతుంది. ఈ పదం తరచుగా రోమన్ చట్టంలో సంభవిస్తుంది. అది ఒక సంతకం యొక్క బాధ్యతసహిత ఒప్పుకోలు. దేవునికి చేసిన అప్పుల విస్తారమైన జాబితాగా దర్శనమిస్తూ మన పాపాలు దేవుని ముందు మనం బాధ్యులు అని ఎంతో స్పష్టం చేస్తాయి.
” ఆజ్ఞలవలన “: ఆర్డినెన్స్, నిర్ణయం, ఆదేశం, ఒక సూత్రీకరించబడిన నియమం (లేదా నియమాల సమితి) ప్రజలు తప్పనిసరిగా ఏమి చేయాలో నిర్దేశించడం. ధర్మశాస్త్ర౦ మనము దేవునికి ఋణముగా ఉన్న ఆవశ్యకతల పత్రమును కలిగి ఉ౦ది. ఇది మనకు వ్యతిరేకంగా దేవునికి ఉన్న బహిరంగ అభిప్రాయము; మన పాపములాను బట్టి ఆయన చేసిన అభియోగాల జాబితా అది. ఇది మోషే ధర్మశాస్త్ర౦. దేవుడు నిశ్చయముగా మనకు వ్యతిరేక౦గా నిలవాలి, ఎ౦దుక౦టే ఆయన తన సొ౦త సారాంశాన్ని, ప్రమాణాలను విభేదించలేడు. అందువలన ధర్మశాస్త్రము పరిపూర్ణతను డిమాండ్ చేస్తుంది.
మనమీద ఋణముగాను
” మనకు విరోధముగాను” : వ్యతిరేకంగా, వ్యక్తులకు విరుద్ధంగా ఉండే దానికొరకు ఉపయోగిస్తారు. పాత నిబంధన యొక్క ఆజ్ఞలు మరియు మన నైతిక స్వభావం మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాయి. దేవుడు పరిపూర్ణుడు గనుక ఆయన కలిగియున్న ప్రతి ప్రమాణము మనకు విరోధముగా సాక్ష్యముగా ఉండును.
మన౦ పూర్తిగా చెల్లించలేని దేవుని నీతి యొక్క రుణపత్రమును ఎదుర్కొవలసియుంది. మన౦ దేవునికి పాపము పాపరాహితముగా ఉండు విషయములో రుణపడి ఉన్నాము. ఈ రుణాన్ని మనము చెల్లించలేము. మనకు వ్యక్తిగత వనరులూ లేవు. అప్పుల్లో మనము కూరుకొని ఉన్నాము. మనము చెల్లించలేని వారముగా ఉన్నాము. ఈ కారణంగా మనకు వ్యతిరేకంగా ఒక ఋణపత్రము బయటకు వచ్చింది. క్రైస్తవ్యము యొక్క సౌందర్యం యేసు మన కోసం మన రుణాన్ని రద్దుచేయుటలో ఉంది. యేసు వ్యక్తిగత౦గా మన రుణాలను చెల్లి౦చాడు.
మనకు విరోధముగాను
“మనకు విరోధముగాను” : యుద్ధ౦లో శత్రువులు, వ్యతిరేకమైన కూటమి, వ్యతిరేక౦గా ఏర్పాటు చేయడ౦. మనం ధర్మశాస్త్రము యొక్క ప్రమాణానికి అనుగుణముగా జీవించలేము కాబట్టి అది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మనలను వ్యతిరేకిస్తుంది (రోమా 4:15; 5:20; I కొరింథీయులకు 15:56; గలతీయులు 3:23). దేవుడు ఎప్పుడూ తన పరిపూర్ణత్వం పరంగా నీతిని నిర్వచిస్తాడు.
చట్టం ఒక విధార్త వంటిది. అది మనలను బంధాలలో ఉంచుతుంది కాని అది మనకు ధర్మశాస్త్ర ప్రమాణాల వరకు జీవించే శక్తిని ఇవ్వదు. ఈ చట్టం మనకు పెనాల్టీ మరియు నొప్పితో బెదిరిస్తుంది.
నియమము:
దేవుడు మనకు విరోధముగా ఉన్న ఋణపత్రమును (ధర్మశాస్త్రమును) సిలువద్వారా రద్దుచేసెను.
అన్వయము:
చట్టం పరిపూర్ణతను కోరుతు౦ది కానీ మన౦ దానికి తగ్గట్టు జీవి౦చలేము. దేవుడు అత్యంత నీతిమంతుడు గనుక సంపూర్ణ నీతిని ఆశిస్తున్నాడు. మనలో ఎవరూ ఆ వెలను చెల్లించలేరు. మన జీవితాలలో దేవుని నీతిని ఉత్పత్తిచేయలేము (రోమా 3:10). మనం పాపాత్ములమని ధర్మశాస్త్రము నిరూపిస్తోంది. కాబట్టి, ధర్మశాస్త్ర౦ మనలను మన ఏకైక నిరీక్షణగా క్రీస్తువద్దకు నడిపిస్తుంది (గలతీయులు 3:13). ధర్మశాస్త్ర౦ “మీరు చేయకూడదు” అని చెబుతో౦ది. మనలోపల ఏదో “చేస్తాను.” అంటుంది. “నేను చెయ్యలేను” అనే వాదనకు నన్ను నేను చేయదలచుకుంటాను. మన అందరి హృదయాల్లో ఒక ఆంతరంగిక తిరుగుబాటు ఉంది. “కాలిబాటమీద ఉమ్మి వేయకూడదు” అని ఒక గుర్తు కనిపిస్తే వెంటనే మన లాలాజల గ్రంథులు పనిచేయడం మొదలుపెడతాయి. ఒకవేళ “తడి పెయింట్ ని తాకవద్దు,” అని ఒక గుర్తు కనిపిస్తే, నిజంగా తడిగా ఉన్నదా అని చూడటం కొరకు మనం పెయింట్ ని తాకాలని కోరుకుంటాం. ధర్మశాస్త్రము అది నిషేధించువాటిని చేయుటకు ప్రేరేపించేవిధముగా ఉంటుంది (రోమా 8:3).
యేసు మనకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రము యొక్క నేరారోపణను దూరము చేయుటకు వచ్చాడు. నేరారోపణను దూరపరచుటయేకాక మనలో నూతన హృదయమును ఉంచాడు. ధర్మశాస్త్రము విఫలమైన చోట కృప ప్రభావవంతంగా ఉంటుంది. యేసు ధర్మశాస్త్ర౦ యొక్క వివాదా౦శాన్ని సంపూర్తిగా, శాశ్వత౦గా, తగినవిధంగా సిలువద్వారా రూపుమాపాడు.
మనము మనకు వ్యతిరేకంగా ఒప్పుకున్న, సంతకం చేయబడిన నేరారోపణ వ్యాజ్యము ఉన్నది. ధర్మశాస్త్రము ముందు దివాలా తీసిన వారుగా మనము ఉన్నాము. దేవుడు మనపై చేసిన ఆరోపణల జాబితాను తుడిచివేసాడు. దేవుని పరిశుద్ధత కొరకైనా ఖచ్చితమైన డిమాండ్లను యేసు నెరవేర్చాడు. దేవుడు మన పాపముల జాబితాను తొలగించివేశాడు. ఇది దేవుని ముందు స్థానసంబంధ, న్యాయసంబంధ దోషనివారణము. దేవుని ఎదుట మీకు పరిపూర్ణ క్షమాపణను ఇవ్వడానికి సిలువపై క్రీస్తు చేసిన కార్యమును మీరు వ్యక్తిగత౦గా అ౦గీకరి౦చారా?