మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు … మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;
సిలువపై క్రీస్తు చేసిన కార్యము యొక్క ఆరవ ఫలితం, కృప ద్వారా దేవుడు మనలను క్షమించుట. అలా తిరిగి జన్మించుటవలనా గొప్ప ఆశీర్వాదకరమైన లాభదాయకము.
మన అపరాధములనన్నిటిని క్షమించి
“క్షమి౦చి” అను మాట కృప లేదా ప్రేమ యొక్క చర్య ఫలిత౦గా క్షమాపణను పొ౦దవచ్చునని సూచిస్తుంది . ఒక ఉపకారం బేషరతుగా ప్రసాదించుట అని అర్థం. ఇక్కడ బేషరతుగా అనుగ్రహి౦చబడిన అనుగ్రహ౦ దేవునికి వ్యతిరేక౦గా ఉన్న ఋణ౦నుండి విముక్తి పొందుట. అది క్షమ చర్య (ఎఫెసీయులు 4:32; కొలొస్సయులు 3:13). ఇది దేవుని దయగల సర్వాధిపత్యానికి స౦బ౦ధి౦చిన చర్య.
క్షమి౦చడ౦ ” జీవింపచేసెను” అను దానికి ముందు ఉ౦దని గ్రీకు సూచిస్తో౦ది. మనము దేవుని యెదుట బ్రదికి౦చబడుటకు ము౦దు దేవుడు మనలను మొదట క్షమి౦చాలి (I యోహాను 2:12; ఎఫెసీయులు 1:7; అపొస్తలుల కార్యములు 10:43; 13:38, 29). దేవుడు తన నీతిని తృప్తిపరిచే వరకు కృపను చూపలేడు అనే సూత్రం. భగవంతుడు తన శీలంతో అస్థిరంగా వ్యవహరించలేడు. దేవుడు తన నీతికి వ్యతిరీకముగా తన ప్రేమను కుమ్మరించలేడు.
సిలువవద్ద దేవుడు మన పాపములను క్షమించాడు. సిలువను బట్టి దేవుడు మనకు నిత్యజీవము ప్రసాదించి, సకాలంలో తన కృపను అభ్యాసము చేయగలిగాడు. క్రీస్తు శ్రమల వలన అతని నీతి తృప్తి చెందెను కాబట్టి ఆయన ఈ కార్యమును చేయగలిగాడు. యేసు మన పాపముల నిమిత్తము తీర్పు పొందెను.
దేవుడు “సమస్త” అతిక్రమములను క్షమిస్తాడు అని గమనించండి, కొన్ని కాదు. అదే మనకు నెమ్మదినిస్తుంది. క్రీస్తు కార్యము నందు విశ్రాంతి పొందేవరకు మనము నిజంగా విశ్రమించము.
నియమము:
క్రీస్తు మరణము ద్వారా తన నీతిని తృప్తిపరిచే వరకు దేవుడు తన కృపను అనుగ్రహించలేడు.
అన్వయము:
మనము పాపములోనే జన్మించాము. పుట్టుకతోనే పాపులము. నైజము, ఎంపిక, ఆచరణ ద్వారా మనం పాపులము. సరిఐనదానికంటే కంటే తప్పు చేయడం సులభం; నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడం తేలిక. దేవుడు క్షమిస్తే తప్ప, పాపము మనపై ఉంటుంది. మన పాపము మనలను దేవునినుండి వేరుపరచును. క్రీస్తు సిలువ రక్తము పాపము నుండి మనలను శుద్ధి చేయును. లోకములోని మతాలు, ప్రత్యామ్నాయాలు కనుగొను ప్రయత్నము చేశాయి. వారిలో ఒక్కరు మనల్ని స్వర్గానికి తీసుకెళ్లలేరు. క్రీస్తు సిలువే దేవుని పరిపూర్ణ నీతిని తృప్తిపరుస్తుంది. కాబట్టి దేవుడు మన యెడల ఆయన కృపను, కనికరమును చూపి౦చగలడు. నిత్యజీవానికి కీలకమైన పరిగణన, మన పాపము – క్రీస్తు సిలువతో వ్యవహరి౦చడానికి దేవుని మార్గాన్ని అ౦గీకరి౦చడ౦. నిత్య జీవమౌ పొందుటకు క్రీస్తు శిలువలోని కార్యమును విశ్వసించారా? అది దేవుని జీవమును స్వత౦త్రి౦చుకోవడానికి దేవుని ప్రత్యేక మార్గమని మీరు దాని మీద ఆధారపడి ఉన్నారా?