మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు …మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;
మరియు అపరాధముల వలనను … మీరు మృతులై యుండగా
ఇది శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా, “మృతి”. క్రీస్తులో క్షమాపణ పొందకముందు, ఆయన ప్రమాణాల ఉల్లంఘన వలన మనము దేవునికి చనిపోయినవారము. అది నశించిన వారి దుర్గతి. అది దేవుడి బిడ్డయొక్క గతం. దేవునిదృష్టిలో చనిపోవడానికి బదులుగా సజీవ౦గా ఉన్నాడు. అపరాధములచేత చనిపోవడానికి బదులు, క్రైస్తవుడు పాపమునకు చనిపోయిఉన్నాడు.
” యుండగా” అనే పదం మరణ స్థితిని సూచిస్తుంది. క్రైస్తవేతరులుగా మరణపు స్థితిలో ఉన్నాం. అవిశ్వాసులు రక్షణ కొరకైన దేవుని నిత్య ప్రణాళికకు వెలుపల ఉన్నారు.
మృత్యువు అంటే వేరు, వినాశనం కాదు. మనము క్రీస్తును తెలుసుకునేముందు, మనము దేవుని నుండి వేరుచేయబడ్డాము (యోహాను 5:24, 25; II కొరిం 5:14, 15; రోమా. 6:13). పాపంలో ఉన్నవారు పాపంలో చనిపోయినవారు. మరణ౦ శరీరాన్ని క్షీణ పరుస్తుంది కాబట్టి పాపము ఆత్మను కలుషితముచేస్తుంది. చనిపోయిన వ్యక్తి తనకు తాను సహాయ౦ చేసుకోలేదు అదే విధముగా పాపంలో చనిపోయిన ఒక వ్యక్తి తనకు తానుగా సహాయ౦ చేయలేకపోతున్నాడు. అతడు దేవునికి చనిపోయిఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేయలేడు. వారికి దేవునిని తెలుసుకునే సామర్థ్యము లేదు (I కొరిం. 2:14). దేవునిని తెలుసుకోవడానికి వారికి యేమియు లేదు.
ఒక ప్రమాణాన్ని దాటడం లేదా ఉల్లంఘించడం అనేది ఒక “అపరాధము”.
శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను
మన స్వభావ౦ “సున్నతి లేనిది,” అది దేవుని ను౦డి వేరుచేయబడి ఉ౦ది.
ఇది మనం క్రీస్తు గురించి తెలుసుకునే ముందు మన స్థితిని వివరిస్తుంది. మనము దేవునికి చచ్చిన స్తితిలో ఉన్నాము. అది పాపపు సామర్థ్యపు కోరికలు విశ్వాసిలో ఇప్పటికీ పనిచేస్తాయని భ్రష్టు పట్టిన నైతిక పరిస్థితి. ఇది సిద్ధాంతపరంగా దేవునిపట్ల ఉల్లంఘన.
” సున్నతిపొందక యుండుటవలనను ” అనే పద౦ స్త్రీ పురుషులిద్దరిని సూచిస్తో౦ది. మనుషులందరూ పతనమైన పాపపు స్వభావము కలిగిఉన్నారు.
నియమము:
ప్రతి క్రైస్తవునికి పాపమును ఉత్పత్తి చేసే కర్మాగారం ఉంది – ఇది పాపపు సామర్థ్యం.
అన్వయము:
క్రైస్తవ జీవితాన్ని స్వీయ ప్రణాళికలవలన ద్వారా జీవించలేము. పాపపు సామర్థ్య౦ దేవుని ఎదుట జీవించు మన సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అందుకే మనం సిలువకు వెళ్ళి క్రైస్తవ జీవన విధానం జీవించడానికి క్రీస్తు మీద ఆధారపడవలెను.