Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

ఇప్పుడు మనం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరుగు  దాడినుండి భద్రతా వలయములోని మూడవ అంశమునకు వచ్చాము.

సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై

” సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై” అనేది సత్యం యొక్క క్షీణతకు వ్యతిరేకంగా భద్రతా వలయములోని మూడవ అంశము. తన కృపను బట్టి, క్రీస్తు మర్మమును గ్రహించుటకు  దేవుడు మనకు పూర్తి భరోసా ఇచ్చాడు.

” సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై” క్రైస్తవ్యము యొక్క గొప్ప సత్యాల గురించి మంచి వివేచన కలిగిఉండుట. దేవుడు మన ఉపయోగం కోసం వనరులను సకాలంలో సమకూరుస్తాడు. ఇవి మన బహుమతులు, సామర్థ్యాలు, తెలివితేటలు లేదా ప్రతిభకు మించినవి. “సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగి” ఉన్న వ్యక్తి ఇకపై దేవుని వాక్యాన్ని ప్రశ్నించడు. సందేహం ఇకపై కేంద్ర విషయము కాదు. ఈ విశ్వాసి అధిక సంతృప్తితో సత్యాన్ని స్వీకరిస్తాడు.

అవగాహన నుండి నిశ్చయత వస్తుంది. నిబ్బరమైన విశ్వాసి ” సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము” కలిగి ఉంటాడు. అతను పూర్తి ధైర్యముకలిగి ఉన్నాడు. అతనికి చాలా నిశ్చయతలు ఉన్నందున, ఇది హామీల సంపూర్ణ గ్రహింపుపుకు దారితీస్తుంది.

 “సంపూర్ణ గ్రహింపు” అనేది మనం సత్యాన్ని గ్రహించుటకు స్థిరమైన ఒప్పుకోలు. ఈ వ్యక్తి సత్యము  ఏమిటో తనకు ఖచ్చితంగా తెలుసునని విశ్వాసం యొక్క ఉన్నతికి చేరుకున్నాడు. అతను సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోడు లేదా అది భరించని అర్థాలను జతచేయడు. ఈ విషయంలో అతను దేవుని మనస్సు ఎరిగినవాడు.

నియమము:

విశ్వాసము ” సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము” నుండి వస్తుంది.

అన్వయము:

 “సకలైశ్వర్యము” మన జీవితానికి దేవుని అధికారాలను ఎలా ఉపయోగించుకుంటుందో వివరిస్తుంది. మనము దేవుని నిబంధనలను ఆశ్రయించినప్పుడు మనం పాపాలతో పోరాడవచ్చు,ఒకవేళ మనం పాపం చేస్తే, మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించగలడని మనకు నమ్మకం ఉంది (1యోహాను1:9). మనము క్షమించబడుటకు దేవుని నమ్మకత్వముపై ఆధారపడుతాము. దేవుడు మనపట్ల శ్రద్ధ వహిస్తున్నాడని మనకు నమ్మకం ఉన్నందున మనము అతనిపై ఆధారపడుతాము (ఫిలి. 4:6,7;  1పేతు. 5:7). మనం “యేసు నామమున” సమీపించినందున క్రీస్తు వలన దేవుడు మన ప్రార్ధన వింటాడని మనకు తెలియును.

దేవుడు మనకు ఆధీక్యతలను (కృప) ఇచ్చినందున, మనకు విశ్వాసం ఉంటుంది. మా పనితీరుపై మనకు నమ్మకం ఉండకూడదు. ప్రపంచం కృప మీద ఆధారపడి జీవించడము లోకము మనలో చూచినప్పుడు, భిన్నమైన నాణ్యమైన జీవితాని గుర్తిస్తుంది. వారు ధైర్యముగల ఉన్న వ్యక్తిని చూస్తారు. ఈ ధైర్యము “జ్ఞానం” లేకుండా రాదు. దేవుని వాక్య జ్ఞానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. క్రీస్తు చేసినదాని ఆధారంగా దేవుని కృప, దేవునిలోని ఆధీక్యతలను అర్థం చేసుకున్నవారమై మనం ధైర్యమును కలిగి ఉండగలము.

మీ జీవితంలో మీకు ధైర్యము ఉందా? పాపము, ప్రతికూలత మరియు సమస్యలతో ఏమి చేయాలో మీకు తెలుసా? మీరు దేవుని చిత్తంలో ఉన్నారని యెరిగి మీరు ఒక తీర్మానము తీసుకోగలరా?

Share