Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

దేవుని సత్యముపై దాడిని వ్యతిరేకించే భద్రత వలయములోని మొదటి భాగము దేవుని వాక్యము.

తమ హృదయములలో ఆదరణపొందవలెనని

 “ఆదరణపొందవలెనని” అనే పదానికి ఇక్కడ “ధృవీకరించబడుట” అని అర్ధం కావచ్చు. కొలస్సి విశ్వాసులు ఆధ్యాత్మితలో మార్పుకు గురయ్యే ప్రమాదములో ఉన్నారు. మతం యొక్క పరిశీలనాత్మక వ్యవస్థ (జ్ఞానవాదం) లోకి మారడానికి వారు శోదించబడ్డారు. ఇది వారు అస్థిరత యొక్క దశలోకి ప్రవేశించడానికి కారణమైంది. వారు దేనిని నమ్మలో అన్న సంగ్ధిగ్దములో పడ్డారు.

ఆధ్యాత్మిక అస్థిరత మనలను తప్పుడు సిద్ధాంతానికి గురి చేస్తుంది. భావోద్వేగాలు ఆధిపత్యంలో ఉన్నప్పుడూ ఎవరూ ఆధ్యాత్మిక సమస్య నుండి కోలుకోలేరు. ఉత్సాహం సిద్ధాంతపరమైన వక్రీకరణ నుండి మనలను రక్షించదు. దానితో పాటు వచ్చే ప్రతి వేదాంత ధోరణితో పైకి క్రిందికి వెళ్లేలా చేస్తుంది.

నియమము:

దేవుని వాక్యం ఆత్మకు ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

అన్వయము:

తప్పుడు బోధను గుర్తించడానికి మరియు ఎదుర్కోవటానికి మీరు దేవుని వాక్యాన్ని తగినంతగా తెలుసుకున్నారా? లేకపోతే, ఆధ్యాత్మిక అస్థిరత మీ విశ్వాసంపై దాడి చేయడానికి మిమ్మల్ని గురి చేస్తుంది.

మీ సమీపాస్తులను మీ సమస్యలకు కారణముగా మీరనుకుంటున్నారా? మీరు అందరి పట్ల క్రూరంగా ఉన్నారా? మీరు అలా చేస్తే, మీరు సాతానుకు వ్యతిరేకంగా జరుగు దేవుని యుద్ధంలో ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నారు. ఈ గత వారంలో, మీరు మీ సమస్యలకు కారణము ఇతర వ్యక్తులపై వేస్తున్నారా? మీరు అసంతృప్తి చెందిని వారుగా ఉన్నారా? మీరు మీ సమస్యలతో మత్తులో ఉన్నారా? మీరు మతిస్థిమితం పొందారా? మన సమస్యలకు మిగతావారిని నిందిస్తే, మనం అస్థిరతతోనే ఉంటాం.

జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా, మనం ఆయనను అనుమతించినట్లయితే దేవుడు మనకు సహాయపడగలడు. యో-యో లాగా పనిచేయడానికి దేవుడు క్రైస్తవ జీవితాన్ని రూపొందించలేదు. దేవుడు తన వాక్యం ద్వారా ఒక క్షేమాభివృధ్ధి కలిగించడం ద్వారా క్రైస్తవ జీవితంలో స్థిరత్వాన్ని రూపొందించాడు. మనము ఇబ్బందులు మరియు నిరాశల నుండి విముక్తి పొందామని కాదు. మనలో ప్రతి ఒక్కరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. మనల్ని నిరూపించుకోవడానికి దేవుడు మన జీవితాల్లో ప్రతికూలతను రూపొందిస్తాడు.

మన జీవితంలోని విషాద దుస్థితి గురించి అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. సంఘములో మీరు కలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి వారం వారికి జరిగిన భయంకరమైన విషయాల గురించి మీకు చెబితే మీరు ఎలా ఇష్టపడతారు? దానికి ముగింపు ఉండదు “అయ్యో! నాకు చాలా విచారముగా ఉంది”. దేవుడు తన పిల్లల పట్ల చేసిన రూపకల్పన అది కాదు. విశ్వాసి సత్యంపై మొట్టమొదట నిలబడాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుడు తన ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా కరుణను నిరోధిస్తాడని కాదు. కరుణ అనేది దేవుని కార్యక్రమంలో సత్యానికి ద్వితీయ విలువ.

Share