వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
సత్యంపై దాడికి వ్యతిరేకంగా రక్షణ యొక్క నాలుగు పంక్తులలో మొదటిది దేవుని వాక్యం (మునుపటి అధ్యయనాలు). దేవుడు వాక్యము ద్వారా మన హృదయాలను బలపరుస్తాడు.
తమ హృదయములలో ఆదరణపొందవలెనని
“ఆదరణపొందవలెనని” అంటే, అక్షరాలా, కలిసి పిలవడం. అందుబాటులోఉన్న వ్యక్తిని పిలవడం దీని అర్థం. తుదకు అవసరమైన సమయంలో సహాయం కోసం అందుబాటులో ఉన్న వనరుల సహాయము కోరుట దీని అర్థం.
క్రైస్తవునికి అవసరమైన సమయంలో సహాయం చేయడానికి అందుబాటులోని వనరులు ఏమిటి? కష్ట సమయాల్లో మనకు అవసరమైన వాటిని నేర్పడానికి ఇక్కడ ఒకరు ఉన్నారు. వ్యక్తికి కాదు, వ్యక్తి తీసుకువచ్చే సత్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. కష్టములో మనలను స్థిరీకరించేది సత్యమే.
నియమము:
కష్ట సమయాల్లో సత్యం మనలను స్థిరీకరిస్తుంది.
అన్వయము:
సత్యబోధన వలన, మనము మోసపూరిత లేదా నకిలీ ఆలోచనలకు వ్యతిరేకంగా ఎదురుదాడిని చేస్తాము. మన చుట్టూ విషయాలు విఫలమైయినప్పుడు మనము సత్యాన్ని పిలిచినప్పుడు లేదా సత్యాన్ని ఉపయోగించినప్పుడు, మనము దేవుని శాంతిని అనుభవిస్తాము. యేసు క్రీస్తు మనలను శాశ్వతంగా రక్షించడమే కాక, మనలను సరైన సమయానికి రక్షిస్తాడు అని మనం నశించిన లోకానికి చూపిస్తాము. అది వ్యక్తిగత వనరులకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆయన తన వాక్యము ద్వారా మనలను రక్షిస్తాడు. ఈ మొదటి రక్షణ వలయము వెనుక మీరు ఎంత సమయం గడిపారు?