వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
క్రైస్తవ విశ్వాసంపై దాడికి వ్యతిరేకంగా భద్రత వలయాలలో నాలుగింటిలో మొదటి దానిపై అధ్యయనాన్ని మనము కొనసాగిస్తున్నాము. భద్రత వలయాలలో మొదటిది దేవుని వాక్యముపై ఆధారపడటం.
తమ హృదయములలో ఆదరణపొందవలెనని
ఈ పదబంధాన్ని ఇరవయ్యవ శతాబ్దంలోని ప్రజల అవగాహనతో చదివితే మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మనలో చాలామంది భావోద్వేగాలకు “హృదయము” అని “ఆదరణ” అను మాటకు భావోద్వేగ మద్దతును అర్ధం చేసుకోవడానికి అవకాశమున్నది. ఈ అర్ధాలు రెండూ మొదటి శతాబ్దం భావనను తెలియజేయవు .
మన విశ్వాసంపై దాడి చేసే సమయాల్లో స్థిరీకరించే సూత్రం ఏమిటంటే, మన “హృదయములలో ఆదరణపొందుట.” “హృదయం” అనే పదం మన భావోద్వేగాలను సూచించదు. వాలెంటైన్స్ డే వెనుక ఉన్న ఆలోచనతో దీనికి సంబంధం లేదు; అనగా ఇది శరీరసంబంధమైనది మరియు సెంటిమెంట్ అని కాదు.
బైబిల్ “హృదయం” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అది మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. హృదయం మనస్సు, భావోద్వేగం, సంకల్పం, ఆత్మ, జ్ఞాపకాలు, వైఖరులు – పూర్తి వ్యక్తిత్వము. మన జీవితములో విషాదం సంభవించినప్పుడు సాధారణంగా మనం చేసే మొదటి పని ఆలోచించడం మానేసి మానసికంగా పనిచేయడం ప్రారంభించుట. మనము ఏడ్చుట, అలుగుట వంటి వాటితో, అపస్మారకముగా మారుతాము. అపస్మారకము అంటే మనం హృదయములోని ఆలోచనా విభాగాన్ని ఉపయోగించడం మానేస్తాము.
నియమము:
క్రైస్తవ జీవితంలో – మనస్సు, భావోద్వేగం మరియు సంకల్పం – సంపూర్ణ వ్యక్తిత్వము జోక్యము కలిగి ఉంటుంది. వైఖరి పూర్తి వ్యక్తి యొక్క ఫలితం.
అన్వయము:
క్రైస్తవుడు క్రైస్తవ జీవితాన్ని గడపడానికి సంపూర్ణ వ్యక్తికి సంబందించిన వనరులను ఉపయోగించుకోవాలి. వైఖరికి సంబందించిన పాపములు సంబంధాలను పాడు చేస్తాయి. అవి మనలను ఇతర వ్యక్తులకు తీర్పునిచ్చేలా చేస్తాయి. ఈ వైఖరుల వల్ల మనం విరోధాలలోకి ప్రవేశిస్తాము. వైఖరి పాపములు అస్థిరతకు కారణమవుతాయి. మతిబ్రమించిన వ్యక్తిగా మనలను చేస్తుంది. దేవుని వాక్యం మన “హృదయాలను” స్థిరపరచి, సంపూర్ణ వ్యక్తి కొరకైన దేవుని ఆలోచనా విధానానికి మనలను నడిపిస్తుంది.