Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.

 

ఈ వచనము దేవుని యెదుట మన శాశ్వతమైన స్థానాల్లో ఒకదాన్ని తెలియజేస్తుంది. మన రక్షణ ఈ లేఖనములోని విమోచనము మరియు పాప క్షమాపణ అను రెండు విషయాలు కలిగి ఉన్నది. పాపము మనలను అమ్మివేసి మనలను బానిసలుగా చేసుకుంది. మనం విమోచించబడాలంటే, మనం పాపం నుండి విముక్తి పొందాలి. దేవుడు క్రీస్తు రక్తమువలన క్షమించడం ద్వారా దీన్ని చేస్తాడు.

ఆ కుమారునియందు మనకు విమోచనము

“విమోచనము” అంటే విమోచన క్రయధనం ద్వారా రక్షించడం. బైబిల్లో విమోచన కొరకు ఉపయోగించబడిన పదములలో ఇది బలమైన పదం. విమోచన కోసం ఉపయోగించిన ఈ ప్రత్యేక పదం అంటే చెర నుండి దాసునిగా కొనడం. అలంకారికంగా, విమోచన క్రయధనం చెల్లించడం ద్వారా పాపం నుండి విడుదల చేయడం (ఎఫె. 1:7,14; 4:30; రోమా. 8:23; హెబ్రీ 9:15; లూకా 21:28). విమోచన క్రయధనం చెల్లించడం ద్వారా దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ విమోచన క్రయధనం క్రీస్తు రక్తం.

విమోచన కోసం వాడిన ఈ పదం భావగర్భితమైనందున (నుండి విమోచనం), ఇది మన విమోచన యొక్క పరిపూర్ణతను సూచిస్తుంది. తదుపరి బానిసత్వం అనుసరించదు.

మనము తాకట్టు ఉంచుకొనువారికి అనుబంధముగా విమోచన అనే పదాన్ని ఉపయోగిస్తాము. మనము మా ఉంగరాన్ని తాకట్టు పెట్టి, తరువాత దాన్ని తిరిగి పొందాలనుకుంటే, మనము దానిని  అతనినుండి నుండి విమోచించాలి. ఉంగరాన్ని విమోచించడానికి మనం వడ్డీతో ధర చెల్లించాలి. మన రక్షణ విషయములో యేసే ధర చెల్లించాడు (మార్క్ 10:45; అపొస్తలుల కార్యములు 20:28; 1 కొరిం. 6:20; 1 తిమో 2:5,6; II పేతు 2:1).

ఆయన రక్తము వలన

ఎఫెసీయులకు 1:7 అదే సత్యాన్ని చెబుతూ “ఆయన రక్తము ద్వారా” అను మాటను జతచేస్తుంది. కొన్ని చేవ్రాతలలో ఆ పదబంధాన్ని ఇక్కడ కూడా జతచేస్తాయి. విమోచన అనేది నైతిక బోధన, నైతికత లేదా సరైన జీవనం ద్వారా కాదు. ఇది క్రీస్తు బలి మరణం ద్వారా. మనము పాత నిబంధన యొక్క నియమాల ద్వారా విమోచించబడలేదు కాని క్రీస్తు రక్తం చిందించబడుట ద్వారా విమోచింపబడ్డాము (ప్రక 5:9).

అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.

“పాపక్షమాపణ” అంటే సిలువపై ధర చెల్లించిన క్రీస్తు వలన “ఉపశమనం” (రోమా. 3:24-26). మన పాపమును బట్టి చెల్లించాల్సిన ధరను దేవుడు చెల్లించాడు. “క్షమ” అనే పదానికి బందిఖానా నుండి విడుదల అని అర్థం. పాపం యొక్క శిక్ష యొక్క బానిసత్వం నుండి దేవుడు మనలను విడుదల చేసాడు. మనము క్షమించబడిన వారము; క్రీస్తు మరణం ద్వారా మన పాపం రద్దు చేయబడింది. మన పాపం ఇకపై మనకు వ్యతిరేకంగా ప్రస్తావించబడదు. మన పాపం కొట్టివేయబడింది మరియు తీసివేయబడింది. మనము విముక్తి పొందాము.

నియమము:

పాపపు శిక్ష యొక్క పట్టులో మనము పట్టుబడ్డాము, కాని యేసు తన పాపము నుండి తన రక్తం ద్వారా మనలను విడిపించాడు.

అన్వయము:

దేవుడు పాపములను ఒక్కసారిగా క్షమించాడని చాలా మందికి తెలియదు. క్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచేవారికి వారి పాపాలు శాశ్వతంగా తొలగిపోతాయి. వారు శాశ్వతంగా క్షమించబడతారు. గతం, వర్తమానం లేదా భవిష్యత్తుకు సంబందించిన మన పాపాలన్నీ ఎప్పటికీ క్షమించబడతాయి. పలక శుభ్రంగా తుడిచివేయబడుతుంది (మత్త. 26:28; అపో.కా 5:31; 10:43; 13:38,39; Iయోహాను 2:1,2).

యేసుక్రీస్తు మిమ్ములను మీ పాపముల నుండి శాశ్వతంగా వేరు చేయగలడని మీరు గ్రహించారా? ఆయన మరణం మీ పాపమునకు వ్యక్తిగతంగా చెల్లించింది (హెబ్రీ. 1:3). విశ్వాసం ద్వారా మీరు ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే, మీ పాపములు దేవుని దృష్టిలో శాశ్వతంగా క్షమించబడతాయి (రోమా. 4 8). మీరు ఇప్పుడు అలా చేస్తారా?

Share