Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

 

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి కృతజ్ఞతలు చెల్లించిన పౌలు ఇప్పుడు సాతాను రాజ్యం నుండి విశ్వాసిని రక్షించినందుకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి

 “విడుదలచేసి” మరియు “తెలియజేయబడిన”అను పదాలు పాత నిబంధన యొక్క అంశాలకు సంబంధించినవి.

మన విశ్వాసాన్ని సిలువకార్యముపై ఉంచడం ద్వారా సాతాను రాజ్యం, చీకటి రాజ్యం నుండి మేము విడిపించబడ్డాము(ఎఫె 6:12). దేవుడు సాతాను రాజ్యాన్ని అంధకారసంబంధరాజ్యము అని పిలుస్తున్నాడు (మత్తయి 25:30). మనము చీకటి నుండి పిలువబడ్డాము (I పేతు 2:9). “చీకటి” అనగా కాంతి లేకపోవడం కంటే ఎక్కువ అర్ధము కలిగివుంది; ఇది కాంతికి వ్యతిరేకం. చీకటి దేవుడు లేకుండా ఉండుట మాత్రమే కాదు; అది దేవునికి వ్యతిరేకం. మనము దేవునిపై తిరుగుబాటు నుండి విముక్తి పొందాము.

 “విడుదలచేసి” అనే పదానికి అర్ధం మనము గతంలో ఒక దశలో మార్పు చెందుతాను తెలుపుతున్నది. ఈ విముక్తి ఖచ్చితంగా పూర్తయింది. ఈ రక్షణలో పురోగతి ఉండదు. ఇది ఒక సంఘటన. ఇది ఈజిప్టు నుండి ఇశ్రాయేలూ ప్రజల విముక్తి కంటే గొప్ప ఆధ్యాత్మిక విడుదల.

 “అధికారము” అనే పదం అధికారిక శక్తి. దేవుడు సాతాను అధికారం నుండి మనలను రక్షిస్తాడు. మనము ఇప్పుడు అతని దుష్ట పాలనలో లేము. చీకటికి మనపై అధికారం లేదు. సాతాను అధికారం విచ్ఛిన్నమైంది. మనం ఇకపై వానికి విధేయత చూపాల్సిన అవసరం లేదు. ప్రపంచం ప్రతిరోజూ మరింత దుర్మార్గంగా మరియు క్రూరంగా మారుతోంది. ఇక్కడ “అధికారము” అంటే అధికార పరిధి. మనము ఇకపై సాతాను పరిధిలో లేము. మనము సాతాను యొక్క దౌర్జన్యం నుండి బయట పడ్డాము.

నియమము:

విశ్వాసి సాతాను రాజ్యం నుండి రక్షించబడి, “తండ్రియైన దేవుని ప్రియకుమారుని రాజ్యంలో” శాశ్వతంగా ఉంచబడ్డాడు.

అన్వయము:

మన౦ క్రీస్తు రాజ్య౦ ను౦డి బహిష్కరి౦చబడలేము అని గుర్తుచేసుకోవాల్సిన అవసర౦ ఉ౦ది. ఈ ప్రపంచ వ్యవస్థ కంటే మనం మరో రాజ్యానికి చెందినవారమని కూడా మర్చిపోగలం. సాతాను శక్తి అంతయూ మనలను ఆ రాజ్యము నుండి తొలగించలేదు. మనము నిర్ద్వంద్వంగా దేవుని రాజ్యానికి చెందినవాళ్ళం. సాతాను రాజ్య౦ ను౦డి క్రీస్తు రాజ్యానికి మన౦ శాశ్వత౦గా బదిలీ చేయబడ్డాము. మనము ఒక సరిక్రొత్త అధికారము కింద ఉన్నాం. సాతానుకు మిగిలి ఉన్నదంతా, మన౦ వాని రాజ్యానికి చెందినవారమని మనల్ని మోసము చేయడానికి ప్రయత్ని౦చడం. క్రీస్తులో దేవుడు మనకొరకు చేసినదానిని మనము మరచిపోవడము సులభము. మనం ప్రజల మీద లేదా ఇతర విషయాల మీద దృష్టి పెడ్తాము కానీ  సత్యము యొక్క విషయము పై కాదు.

Share