Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి

 

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి

“పాలివారము” అనే పదానికి అర్థం పంచుకొనువారు. క్రైస్తవులు క్రీస్తుతో భాగస్వాములవుతున్నారు. క్రీస్తు దేవుని వారసుడు (హెబ్రీ. 1:2). వారసత్వము అనేది కుమారత్వము (రోమా. 8:16, 17) ఆధారంగా ఉంటుంది. క్రీస్తుతో ఏకం అయిన వారందరూ తన వారసత్వాన్ని పంచుకుంటారు (ఎఫె 1:11). ప్రియుకుమారునిలో అంగీకరింపబడ్డాము (ఎఫ. 1:6). దేవుని రాజ్య౦ వారసత్వ౦గా పొ౦దడానికి రక్షణ మనకు అర్హతను కలుగజేస్తు౦ది.

మనము క్రీస్తుతో సహవారసులుగా ఉన్నాము, “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” (రోమా. 8:16, 17). క్రీస్తుతో తోడి వారసులుగా ఉ౦డడ౦ అ౦టే ఏమిటి? ఒక జంట బ్యాంకులో ఉమ్మడి ఖాతాను తెరిచినప్పుడు, వారిద్దరూ మొత్తం ఖాతాకు ప్రాప్తి కలిగి ఉంటారు. మానవ లెక్కలో ఎవరైతే ముందుంటారో వారే డబ్బు పొందుతారు! దైవ ఖాతాలో ఇద్దరూ సమానంగా ఖాతాను ప్రాప్తి చేస్తారు. అంటే అందులో సగం ప్రభువు, సగం నాకు అని అర్థం కాదు.

మనము పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పంచుకుంటాము. “పరిశుద్ధుడు” అంటే క్రీస్తుతో శాశ్వతంగా ఐక్యమైన వ్యక్తి. ఇతడు ఎప్పటికీ దేవునికై వేరు చేయబడిన వ్యక్తి. మనం తిరిగి జన్మించిన క్షణమున పరిశుధ్దులముగా అవుతాం. ఒక పరిశుద్ధుని యొక్క లక్షణాలను తీసుకోవడానికి సమయం పడుతుంది. ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో నేర్చుకోవాలి. కృపలో ఎదగడానికి సమయం పడుతుంది. మనం అత్యంత పరిశుద్ధలుగా కాకపోవచ్చు, కాని మనం పరిశుద్ధులము. మనం పెరిగేకొద్దీ మనం

“తేజము” అనేది ఆధ్యాత్మిక గోళం, దీనిలో ప్రభువు అంధకారసంబంధమైన అధికారం నుండి మనలను మార్చాడు (ఎఫె 6:12). దేవుడు మనలను సాతాను మరియు అతని తిరుగుబాటు రాజ్యం యొక్క అధికారం నుండి బయటకు తీసుకెళ్ళి, యేసు రాజు సార్వభౌమాధికారం క్రింద ఉంచాడు. “తేజము” అనేది పరలోకంలో దేవుని ఉనికిని సూచిస్తుంది. దేవుని మహిమ అతని బయలుపరచబడిన సన్నిధి(I తిమో 6:16).

నియమము:

మనము క్రీస్తు వారసత్వంలో పాలు పంచుకుంటాము.

అన్వయము:

మీరు ఆధ్యాత్మికంగా ఎంత ధనవంతులో మీరు గ్రహించారా? మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎంత ఎక్కువగా పరిశీలిస్తే అంతగా మనం ఎంత ధనవంతులమో తెలుసుకుంటాం. మనము ఆధ్యాత్మిక పట్టణంలోని ఉత్తమ భాగంలో జీవించవలసి ఉండగా, మనము ఒక ఆధ్యాత్మిక మురికివాడ ప్రాంతములో నివసించవచ్చు, మన ఆధ్యాత్మిక ఆధీక్యతలకు దిగువన జీవించడం ఎంత విచారకరము! మనము కోటీశ్వరులుగా ఉన్నప్పుడు భిక్షగాడివలే జీవిస్తాము. కంటికి కనిపించనిదాన్ని విశ్వాసం స్పష్టంగా కనిపించేట్లు చేస్తుంది.

Share