యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
3-8 వచనాలు ఒకే భావాన్ని కలిగి ఉంటాయి. ఈ వాక్యం మూడింతతల కృతజ్ఞతను నిర్దేశిస్తుంది. 3-5 వచనాలు కృతజ్ఞతకోసం కారణాన్ని ఇస్తాయి – కొలొస్సయుల విశ్వాసం, ప్రేమ, నిరీక్షణలో అనే కృపల త్రయాన్ని అనుసంధానిస్తుంది. 6-8 వచనాలు కృతజ్ఞతకోసం మూలాన్ని అందిస్తాయి.
పౌలు కొలస్సివిశ్వాసుల విశ్వాసానికి (వ.3-4) ప్రేమకు (వ.4) , నిరీక్షణకు(వ.5), ఫలమునకు (వ.6) కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ లేఖనభాగము అంతటా వారిపైఉన్న సువార్త ప్రభావం కేంద్రంగా ఉంది. సువార్త ఎక్కడ బోధించబడితే అది అదే పని చేస్తుంది. జీవము విత్తనంలో ఉంది, విత్తేవారిలో కాదు. ఇది రక్షించేది సువార్త, వర్తమానికుడు కాదు. ఎల్లప్పుడూ విత్తనం మంచిది కాని కొన్నిసార్లు భూమి పేలవంగా ఉండవచ్చు. అది పంటను ప్రభావితం చేస్తుంది.
మూడు అంచెల కృతజ్ఞతలో మొదటిది కొలొస్సయుల విశ్వాసం, (వ.4)
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
తన అలవాటు ప్రకారం, పౌలు తాను వ్రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాడు, 1:3-8. పౌలు గలతీయులు లేదా కొరింథీయులనుబట్టి (II కొరింథీయులకు) కృతజ్ఞతలు చెప్పలేదు. అతను వ్రాసిన ప్రజలకు దేవునికి నిజాయితీగా కృతజ్ఞతలు చెప్పగలిగితే, అతను ఎప్పుడూ అలా చేస్తాడు. వందన వచనములు పూర్తయిన వెంటనే అతను వారి గురించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు (రోమా. 1:8 పోల్చండి). గలతీయులనుబట్టి ఆయన నిజాయితీగా దేవునికి కృతజ్ఞతలు చెప్పలేకపోయాడు. అతను కొరింథీయుల కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది (I Cor 2 :1).
తాను ఎన్నడూ చూడని ప్రజలకొరకు పౌలు చేసిన ప్రార్థన ఇది. పౌలు వారి ఇద్దరు సభ్యులైన ఎపఫ్ర మరియు ఫిలేమోనులను కలిశాడు. ఇద్దరూ ఎఫెసు వంటి ఇతర ప్రాంతాలలో పౌలు పరిచర్య ద్వారా ప్రభువును తెలుసుకుని ఉండవచ్చు. అతను వారి ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు (2:1) అయినప్పటికీ ఆయన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీ గురించి మేము విన్నవన్నీ ఇతరుల నుండి విన్నాము.’ తిరిగి జన్మించిన వారు దేవుని అద్బుత కృపకు నిదర్శనము కనుక వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము.
నియమము:
కృతజ్ఞతాస్తుతి ప్రతి ప్రార్థనలో ఒక భాగంగా ఉండాలి. మనము ఆనందించదగిన ప్రతీయాంశము మన కృతజ్ఞతాస్తుతి అంశముగా ఉండాలి.
అన్వయము:
ఇతర క్రైస్తవులకు కృతజ్ఞతలు చెప్పడానికి మీరు ఎంత సమయం గడుపుతారు? మీ క్రైస్తవ జీవితానికి ఆశీర్వదము కలిగించే ప్రజలకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారా? మిమ్మల్ని క్రీస్తు వద్దకు నడిపించిన వ్యక్తికి లేదా మీ పట్ల ఆసక్తి చూపి, మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కఠినమైన ప్రదేశాల ద్వారా మీకు సహాయం చేసిన వ్యక్తిని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారా?